Vallabhaneni Vamsi : నేడు వంశీ పిటీషన్లపై విచారణ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Update: 2025-02-19 04:21 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై నేడు కౌంటర్ దాఖలు చేయనున్నారు. బెయిల్ పై పోలీసులు, కస్టడీపై వంశీ తరపు లాయర్లుకౌంటర్ దాఖలు చేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో సత్యవర్థన్ ను బెదిరించి కిడ్నాప్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

బెయిల్ ఇవ్వాలంటూ...
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ తరుపున న్యాయవాదులు అనారోగ్య కారణాల వల్ల వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరారు. అలాగే వంశీని విచారించేందుకు తమకు పది రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరారు. ఈ రెండు కేసులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన అనంతరం దీనిపై న్యాయస్థానం విచారణ చేయనుంది.


Tags:    

Similar News