తిరుమలపై గేమింగ్ యాప్.. చర్యలు తీసుకుంటారా?
తిరుమల శ్రీవారి ఆలయం మీద ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ వచ్చింది.
తిరుమల శ్రీవారి ఆలయం మీద ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ వచ్చింది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ గేమ్‌ను డిజైన్ చేశారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రోబ్‌లాక్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ కోరారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.