Free Bus For Women in Andhra Pradesh : ఫ్రీ బస్సులో ఈ మార్పులు గమనించారా? అయితే ఇవి తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన కనిపిస్తుంది.

Update: 2025-08-18 05:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన కనిపిస్తుంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. అయితే వరస సెలవులు రావడంతో కొంత బస్సులలో రద్దీ అంతగా లేదు. కానీ నేటి నుంచి పాఠశాలలతో పాటు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు నుంచి అసలు ఉచిత బస్సులో రద్దీ ఎలా ఉందన్నది అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన కనిపించిందని అధికారులు తెలిపారు. తొలి రోజు 11.47 లక్షల మంది వినియోగం - తొలి రెండు రోజుల్లోనే మహిళలకు రూ.5 కోట్లకు పైగా ఆదా జరిగిందని అంటున్నారు.

మార్పులు చేస్తూ....
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణంలో గందరగోళానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా మరికొన్ని నిర్ణయాలను తీసుకుంది. విద్యార్థులకూ ఉచిత బస్ ఇవ్వనుంది. ఉచిత బస్సులపై స్టిక్కర్లను ఏర్పాటు చేసింది. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ బస్సులో టికెట్ తప్పనిసరి అని పేర్కొంది. రంగులు, స్టిక్కర్లు చూసి బస్సు ఎక్కాలని కోరింది. మరొక వైపు చంద్రబాబు నాయుడు మహిళల నుంచి ఉచిత బస్సు పథకంపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఘాట్ రోడ్లున్న ప్రాంతాలకు కూడా ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని తెలిపారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఒరిజనల్ మాత్రమే అవసరం లేదని తెలిపారు.
ఫీడ్ బ్యాక్ తీసుకుని...
దీంతో పాటు మహిళల ప్రయాణానికి అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను తయారు చేసింది. మహిళలు ఇబ్బంది పడకుండా సీటింగ్ అరేంజ్ మెంట్ చేసింది. కొంత సమయం తీసుకునైనా ఈ పథకం సూపర్ హిట్ అవ్వాలని ఈ పథకం అమలవుతున్న అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసిన అనంతరం పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా రోజువారీ కూలీలకు వెళ్లే, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు మాత్రం ఈ పథకం ప్రయోజనం అవుతుంది. నెలకు దాదాపు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఆదా అవుతుందని చెబుతున్నారు. అయితే నేటి నుంచి బస్సుల్లో రద్దీ ఎలా ఉంటుందన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News