నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు

నేడు నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-03-04 03:23 GMT

నేడు నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభమయిన వెంటనే ప్రశ్నోత్తరాలు ఉభయ సభల్లో ప్రారంభం కానున్నాయి. రెండు సభల్లో కీలక అంశాలపై నేడు చర్చ జరగనుంది.

కొత్త రేషన్ కార్డులు...
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు, తెలుపు రంగు కార్డుల జారీ ప్రక్రియపై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు సమాధానమిస్తారు. అలాగే ఏపీ వ్యాప్తంగా నెలకొన్న భూవివాదాలపై కూడా ప్రశ్నోత్తరాల సమయంలో క్వశ్చన్ ఉంది. దీంతో పాటు ప్రభుత్వ ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీపై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధామివ్వనున్నారు.


Tags:    

Similar News