Amaravathi : అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు... 17న భారీ బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం నాలుగేళ్లు పూర్తి కావస్తుంది.

Update: 2023-12-10 04:48 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం నాలుగేళ్లు పూర్తి కావస్తుంది. దీంతో ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. రాజధానిని గత ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయగా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదనలోకి తెచ్చింది. చట్టసభల్లో ఆమోదం తెలిపింది.

రైతుల ఆందోళనతో...
అయితే దీనిపై రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుంది. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బహిరంగ సభను ఈ నెల 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం సభ ఏర్పాట్లపై తుళ్లూరులో రైతులు సమావేశం అవుతున్నారు.


Tags:    

Similar News