అఖండ గోదావరితో వేల మందికి ఉపాధి: పవన్ కల్యాణ్

రాజమండ్రిలో అఖండ గోదావరి కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది.

Update: 2025-06-26 06:10 GMT

రాజమండ్రిలో అఖండ గోదావరి కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి అంటేనే గోదావరి అని ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తుందని తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల అని గుర్తు చేసుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన ముళ్లపూడి వెంకట రమణ కూడా ఇక్కడే జన్మించారని అన్నారు.

పర్యాటకులు పెరిగి...
పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు అఖండ గోదావరి ప్రాజెక్టుతో పెరుగుతాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా నాలుగు లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశముందన్న పవన్ కల్యాణ్, శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఆపింది నాటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అని అన్నారు. ఏపీ అంటే ఆయనకు మక్కువ అని అన్న పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన చూపిన చొరవ అభినందనీయమని అన్నారు.


Tags:    

Similar News