జేసీ కుటుంబాన్ని నేను దూషించలేదు : పెద్దారెడ్డి

తాను జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఏనాడూ దూషించలేదని తాడిప్రతి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు

Update: 2025-07-25 12:08 GMT

తాను జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఏనాడూ దూషించలేదని తాడిప్రతి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమను దూషించినట్టు నిరూపిస్తే.. ఆయన ఇంటికి వెళ్లి క్షమాపణ చెబుతానని పెద్దారెడ్డి అన్నారు. తాను ఏనాడూ మహిళలను దూషించే వ్యక్తిని కాదని, అటువంటి నైజం తనలో లేదని పెద్దారెడ్డి చెప్పారు.

నాటి కేసులపైనా...
తన కోడలు వైసీపీ సమావేశంలో పాల్గొంటే అభ్యంతరం చెప్పడమేంటి అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో జేసీ ట్రావెల్స్ వాహనాలకు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై నాటి కేసులు రాజకీయ కక్ష సాధింపులు కాదన్న పెద్దారెడ్డి ఏఎస్పీ, డీపీవోను జేసీ ప్రభాకర్ దూషించడం దుర్మార్గమని అన్నారు.


Tags:    

Similar News