మార్గదర్శిపై నా పోరాటం ఫలించింది

మార్గదర్శిపై తన పదిహేడేళ్ల తన న్యాయపోరాటం మంచి ఫలితాలను ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Update: 2023-04-18 08:51 GMT

మార్గదర్శిపై తన పదిహేడేళ్ల తన న్యాయపోరాటం మంచి ఫలితాలను ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టుల ఆదేశించిందని ఉండవల్లి తెలిపారు. కొన్నేళ్లుగా వివరాలు బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టులో...
2,600 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయని, డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారని, చెక్కుల రూపంలో ఇచ్చారా లేక మరో రూపంలో ఇచ్చారా అన్నది తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలని తెలిపిందన్నారు. ఒక చోట హెచ్.యు.ఎఫ్, మరో చోట ప్రొపైటరీ అని ఎందుకు రాశారని ప్రశ్నంచింది. ఈ విషయాలన్నింటీకి సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు కోరిందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News