పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు బ్రేక్
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు మరోసారి బ్రేక్ పడింది
peddareddy
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు మరోసారి బ్రేక్ పడింది. తాము రక్షణ కల్పించలేమని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. మహానాడు, రాప్తాడు జంట హత్యలతో పాటు ఎంపీపీ ఉపఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని పోలీస్ సూపరింటెండెంట్ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి లేఖ రాశారు. తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు.
హైకోర్టు చెప్పినా...
పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు ఇటీవల కోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డి పర్యటనకు అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే పంచెలూడి దీసి కొడతామని, ఊరుకోబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని భావించి పెద్దారెడ్డి పర్యటనకు పోలీసులు సుముఖంగా లేరు.