Tadipathri : తాడిపత్రిని విడిచి వెళ్లాలన్న పోలీసులు.. వెళ్లిపోయిన పెద్దారెడ్డి

తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మాపల్లెకు వెళ్లిపోయారు. పోలీసులు తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

Update: 2025-09-07 04:49 GMT

తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మాపల్లెకు వెళ్లిపోయారు. పోలీసులు తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న పదిహేను నెలల తర్వాత తాడిపత్రికి చేరుకున్న పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రిని విడిచి వెళ్లాలని కోరారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తుండంతో పోలీసు బలగాలన్నీ అక్కడకు వెళతాయి. తాడిపత్రిలో పోలీసుల బందోబస్తు కష్టమవుతుంది. అందుకే తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసులు పెద్దారెడ్డిని కోరారు. తిరిగి ఈ నెల పదో తేదీ తర్వాత తిరిగి రావాలని కోరడంతో అందుకు పెద్దారెడ్డి సమ్మతించి తాడిపత్రి నుంచి తన స్వగ్రామమైన తిమ్మాపల్లెకు చేరుకున్నారు








Tags:    

Similar News