Breaking : విడుదల రజని మరిది గోపి అరెస్ట్

మాజీ మంత్రి విడుదల రజని భర్త సోదరుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-04-24 02:02 GMT

మాజీ మంత్రి విడుదల రజని భర్త సోదరుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి రజని మరిది గోపిపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఒక క్రషర్ సంస్థ యజమానిని బెదిరించి గత ప్రభుత్వ హయాంలో కోటిన్నర రూపాయలకు పైగా వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.

క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో...
క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి విజిలెన్స్ అధికారులను క్రషర్ సంస్థ వద్దకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారని, దీనివల్ల తాను కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని క్రషర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో విడదల రజనితో పాటు ఆమె మరిది గోపి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే గోపిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News