పేర్నినాని ఇంటి ముట్డడికి జనసేన కార్యకర్తలు.. టెన్షన్
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినేని నాని నివాసాన్ని జనసేన కార్యకర్తలు ముట్టడించారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.
perni nani
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినేని నాని నివాసాన్ని జనసేన కార్యకర్తలు ముట్టడించారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి పేర్నినాని ఇంట ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు రావడంతో పోలీసులకు కూడా అదుపు చేయడం కష్టంగా మారింది.
నాని చేసిన వ్యాఖ్యలకు...
నిన్న మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ముట్డడి చేసినట్లు జనసేన కార్యకర్తలు తెలిపారు. భీమవరంలో బాప్టిజం తీసుకున్నారని చెప్పిన పవన్ ఆయనేనా? అంటూ నాని ప్రశ్నించారు. పొరపాట్లు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకనే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కొత్తగా హిందూమతం తీసుకున్న వారు ఒళ్లంతా నామాలు పెట్టుకుంటారని, తామంతా మొదటి నుంచి హిందువులేనంటూ పేర్ని నాని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటిని ముట్టడంచారు.