Kakani Govardhan Reddy : పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ముత్తుకూరు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ముత్తుకూరు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజులు పాటు కాకాణి గోవర్థన్ రెడ్డి ని పోలీసులు విచారించనున్నారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ వసూలు చేసిన కాకాణి తన అనుచరుల చేత దందా చేయంచారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
టోల్ గేట్ ఏర్పాటు చేసి...
ప్రస్తుతం కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో విచారించేందుకు అదుపులోకి తీసుకున్నపోలీసులు పోలీస్ ట్రేనింగ్ సెంటర్ లో విచారణ చేయను్నారు. ఇప్పటికే ఐదు కేసుల్లో రిమాండ్ లో కాకాణి కి ఒక కేసులో మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.