సోమిరెడ్డి కొడుకు తప్పులు ఎత్తి చూపుతా : కాకాణి
తనకున్న ఆస్తి ప్రజల అభిమానమని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
తనకున్న ఆస్తి ప్రజల అభిమానమని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర కారాగారం లో అందరూ వైసీపీ వారేనని, జైలు అంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రగారం నుండి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదలయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దయవల్ల జైల్లో వైసీపీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందన్న కాకాణి హైకోర్టు బెయిలు మంజూరు చేసిన తర్వాతా కూడా ఉద్దేశపూర్వకంగానే విడుదలలో ఆలస్యం చేశారన్నారు.
ఎందరినో కలిసే...
తన కోసం నిన్న సాయంత్రం ప్రజలు వచ్చారని, ఈరోజు ఉదయం కూడా వచ్చారని, ప్రజల అభిమానం మర్చిపోలేనిదని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.నెల్లూరు జిల్లా లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన వ్యక్తి నీ ఇన్ని రోజులు జైల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఆరు కేసులు సోషల్ మీడియాకు సంబంధించినవని, ఓట్లు వేస్తే లిక్కర్ ఇస్తా అనితాను చెప్పానని హాస్యాస్పదంగా లిక్కర్ కేసులను నమోదు చేశారన్నారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మానసికంగా ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు చేసే తప్పులను కచ్చితంగా ఎత్తిచూపుతానని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.