పోలవరాన్ని వైసీపీ తాకట్టు పెట్టింది

పోలవరం ప్రాజెక్టును వైసీపీ నాయకత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు

Update: 2022-03-05 06:01 GMT

పోలవరం ప్రాజెక్టును వైసీపీ నాయకత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, వైఎస్ వివేకా హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పోలవరం విషయంలో రాజీ పడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విషయంలో నోరు మెదపకపోవడానికి కారణమని దేవినేని ఉమ అన్నారు.

ఇప్పటికే పూర్తి....
రివర్స్ టెండర్లకు వెళ్లకుంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని దేవినేని ఉమ అన్నారు. పునరావాసం కింద ఇళ్ల నిర్మాణంపై జగన్ సమాధానం చెప్పాలని ఆయన కోరారు. లక్ష కుటుంబాలకు శాశ్వత ఇళ్లు నిర్మించాల్సి ఉందని అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ 47,725 కోట్లు ఇస్తే చాలని ఎందుకు రాజీపడ్డారని దేవినేని ఉమ ప్రశ్నించారు.


Tags:    

Similar News