Balineni : నేడు పవన్ తో భేటీ కానున్న బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు
balineni srinivas
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నాయి. నిన్న బాలినేని శ్రీనివాసులురెడ్డి వైసీపీకి ప్రాధమకి సభ్యత్వానికి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత జగన్ కు పంపిన సంగతి తెలిసిందే.
జనసేనలో చేరేందుకు...
అయితే హైదరాబాద్ లో ఉన్న బాలినేని శ్రీనివాసులురెడ్డి అక్కడ తన ముఖ్య అనుచరులతో సమావేశమైన తర్వాత నిన్న సాయంత్రమే విజయవాడకు బయలుదేరారు. ఆయనకు పవన్ కల్యాణ్ ఈరోజు అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆయన జనసేనలో చేరిక ఉంటుందని చెబుతున్నారు. ఎప్పటి నుంచో జనసేన వైపు చూస్తున్న బాలినేని నేడు పవన్ ను కలసి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించనున్నారు.