Balineni : పవన్ తో భేటీ అయిన బాలినేని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు.
balineni srinivasa reddy
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఆయన పవన్ తో సమావేశమవుతారని నిన్నటి నుంచే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వీరిరురురి భేటీ జనసేన కార్యాలయంలో ప్రారంభమయింది. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు.
వైసీపీని వీడి...
ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరతారన్న ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతున్నా ఆయన ఖండిస్తూ వస్తున్నారు. అయితే నిన్న వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన జనసేనలో చేరిక ఖాయమయిందని చెప్పారు. అయితే జనసేనలో మాత్రం అధికారికంగా చేరకపోయినా త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకునే అవకాశముందని తెలిసింది.