నేను బయటకువచ్చాక ఒక్కొక్కడికీ ఉంటదీ...?
డ్రైవర్ హత్య కేసులో జనసేన మాజీ నేత కోట వినుత దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం పులాల్ జైలుకు తరలించారు
డ్రైవర్ హత్య కేసులో జనసేన మాజీ నేత కోట వినుత దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం పులాల్ జైలుకు తరలించారు. డ్రైవర్ రాయుడును హత్య చేసి చెన్నైలో నదిలో పడేయగా తమిళనాడు పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసి కోట వినూత దంపతులతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు.
జైలుకు తరలిస్తుండగా...
అయితే జైలుకు తరలిస్తుండగా వినూత దంపతులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అరెస్ట్ వెనకాల కుట్ర దాగి ఉందని అన్నారు. ఈ హత్య కేసులో తమ ప్రమేయం లేకపోయినా తమను ఇరికించారని అన్నారు. తమపై కుట్ర వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దే పాత్ర ఉదని కోట వినుత ఆరోపించారు.తాను బయటకు వస్తా ఒక్కొక్కడికి ఉంటదంటూ హెచ్చరించారు.