Andhra Pradesh : వల్లభనేని వంశీ అనుచరుల అరెస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ విచారణ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పదకొండు మంది వంశీ అనుచరులు నిందితులుగా ఉన్నారు.
పీఏతో పాటు...
ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో వల్లభనేని వంశీ పీఏ కూడా ఉన్నట్లు తెలిసింది. మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. వీరి నుంచి సమాచారాన్ని రాబట్టిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది.