లొంగిపోయిన మాజీ సీఐడీ చీఫ్ సంజయ్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఆయనపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ పై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన కొన్నాళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. రెండు కోట్ల రూపాయల వరకూ దుర్వినియోగం అయ్యాయని పలు కేసులు నమోదు కావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో...
అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా సంజయ్ కు నిరాశ ఎదురయింది. మూడు వారాల్లోగా సంజయ్ ను కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో ఈరోజు సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఆయనకు బెయిల్ లభిస్తుందా? లేక రిమాండ్ విధిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.