పెద్దపులి దొరికేట్టులేదే?

మూడు వారాల నంచి పెద్ద పులిని బంధించడం అటవీశాఖ అధికారులకు వీలవ్వడం లేదు

Update: 2022-06-16 04:38 GMT

మూడు వారాల నంచి పెద్ద పులిని బంధించడం అటవీశాఖ అధికారులకు వీలవ్వడం లేదు. అది గ్రామాలను మార్చి తిరుగుతుండటంతో ఏర్పాటు చేసిన బోన్ల వద్దకు కూడా రావడం లేదు. తాజాగా శరభవరం వద్ద రెండు పశువులపై పులి దాడి చేయడంతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడుతున్నారు. అది ఎప్పుడు ఏ రూటు మారుస్తుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తెలివిగా....
పగటి వేళ కొండల్లో తలదాచుకుని రాత్రి వేళ మెట్ట ప్రాంతాల్లో సంచరిస్తుంది. ఇప్పటికే బెంగాల్ టైగర్ పదికి పైగా పశువులపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు దానిన పట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా పులి మాత్రం బోనుకు చిక్కడం లేదు. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తోటపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోకి పులి వెళుతుందని అటవీ శాఖ అధికారులు వేసిన అంచనా తప్పుతుంది. అది తిరిగి గ్రామాలవైపు రావడంతో ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది అడవి బాట పడుతుందని చూస్తున్నామని అధికారులు చెబుతున్నా, గ్రామాలవైపే రాత్రివేళ వస్తుండటం ఆందోళన అధికమయింది.


Tags:    

Similar News