నాగార్జునసాగర్ కు వరద నీరు

నాగార్జునసాగర్ కు వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నీటి నిండిపోయి సాగర్ కు చేరుతున్నాయి

Update: 2025-07-26 04:12 GMT

నాగార్జునసాగర్ కు వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నీటి నిండిపోయి సాగర్ కు చేరుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 20వేల క్యూసెక్కులు గా ఉంది. ఔట్ ఫ్లో 10,294 క్యూసెక్కులు గా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటిమట్టం 579.30 అడుగులుగా ఉంది.

నిండుకుండలా...
ప్రస్తుత పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 280.98 టీఎంసీలు గా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి విలువ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా నీటిమట్టం మరో 10 అడుగులు, 32 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే.... నాగార్జునసాగర్ నిండుకుండలా మారనుంది.


Tags:    

Similar News