Andhra Pradesh : కృష్ణా, గోదావరి నదులలో వరద నీరు
కృష్ణా, గోదావరి నదులలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉధృతంగా వరద కొనసాగుతుంది
కృష్ణా, గోదావరి నదులలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉధృతంగా వరద కొనసాగుతుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతుండటంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన అధికారులు. ప్రజలు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.
నీటి మట్టం పెరిగి...
మరొక వైపు గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం, ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం పెరగడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో రెండు నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.