గోదావరికి వరద నీరు.. కేజీ పులస చేప ధర ఎంతంటే?
గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో వరద నీరు ప్రవాహం మాట అలా ఉంచితే పులస చేపలు లభిస్తున్నాయి
గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో వరద నీరు ప్రవాహం మాట అలా ఉంచితే పులస చేపలు లభిస్తున్నాయి. పులస చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. యానాంలో పులస చేప ధర కేజీ పద్దెనిమిది వేల రూపాయలు పలికింది. పుస్తెలమ్మి అయినా పులస తినాలన్న సామెత గోదావరి జిల్లాలో ఉంటుంది. గోదావరికి వరదల సమయంలోనే పులస చేప లభిస్తుంది.
వరద నీటిలో....
వరద నీటికి ఎదురీది వచ్చే ఈ చేప పులుసు చాలా శ్రేష్టమని, దీని రుచి అమోఘంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే వరదల సమయంలో గోదావరి నదిలో పులస చేపల కోసం మత్స్యకారులు వేట చేస్తుంటారు. పులస దొరికితే ఇక పంటపండినట్లే. ధరతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో దీనికి డిమాండ్ అధికంగా ఉంటుంది.