గోదావరి ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న వరద ఉధృతి

గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.11 లక్షల క్యూసెక్కులుగా ఉంది

Update: 2025-08-22 03:29 GMT

గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టింది. అయితే నీటిమట్టం 49.3 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద రాత్రి నుంచి క్రమంగా తగ్గుతుంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, సహాయక చర్యల్లో ఎనిమిది ఎస్డీఆర్ఎఫ్, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి.

రెండో ప్రమాద హెచ్చరిక...
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్టుఅధికారులు తెలిపారు. సాయంత్రానికి బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.


Tags:    

Similar News