రానున్న 24 గంటలు ప్రమాదకరమే

ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 21.70 అడుగుల నీటిమట్టం ఉంది.

Update: 2022-07-17 05:51 GMT

ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 21.70 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ నంుచి 25.80 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. రాజమండ్రి పట్టణంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాటన్ బ్యారేజీ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నియంత్రించారు. కార్లు, బైకులు తప్ప ఎలాంటి భారీ వాహనాలను అనుమతించడం లేదు.

లంక గ్రామాల్లో....
లంక గ్రామాల్లో ఇంకా భయానక పరిస్థితి నెలకొంది. గోదారవి ఉప నదులు గౌతమి, వైనతేయ, వశిష్ట నదులు కూడా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. రానున్న 24 గంటలూ ప్రమాదకరమేనని అధికారులు చెబుతున్నారు. వరద నీరు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నా, పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గేంత వరకూ లంకవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News