కృష్ణా, గోదావరి నదుల పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది

Update: 2025-08-20 04:20 GMT

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మరొకవైపు గోదావరిలోనూ వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2అడుగులకు చేరుకుంది.

అధికారుల అప్రమత్తం...
ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. సహాయక కార్యకలాపాలకు 16 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రక్షణ చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు. కృష్ణా, గోదావరి నదిపరీవాహకలంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


Tags:    

Similar News