Flood Water : వరద నీరు ముంచెత్తే అవకాశం... అలెర్ట్ గా ఉండాల్సిందే
ఉధృతంగా కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
ఉధృతంగా కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.01 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3.42, ఔట్ ఫ్లో 4.04 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 3.71, ఔట్ ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 4.33, ఔట్ ఫ్లో 4.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా నదితో పాటు గోదావరి నది కూడాపొంగిపొరలి ప్రవహిస్తుంది.
వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ...
భద్రాచలం వద్ద నీటి మట్టం 36.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 8.23 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటిపాదుల శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దంలూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లా, మండల కేంద్ర కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి వరద ప్రవేశించే అవకాశమున్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో...
ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని తెలిపింది. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని పేర్కొంది. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేశారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచిస్తున్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దని అధికారులు కోరారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.