నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది

Update: 2025-07-26 12:32 GMT

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు చేరుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ఫ్లో 1,20,222 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 32,638క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాలతో...
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 581.00అడుగులుగా ఉందని తెలిపారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312,045 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 283.5924టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.


Tags:    

Similar News