శ్రీశైలం జలాశయానికి వరద పోటు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది

Update: 2025-08-23 02:33 GMT

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి 4.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయాన్ని చూసేందుకు పెద్దయెత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. శని, ఆదివారాలు వరసగా సెలవులు కావడంతో ప్రాజెక్టు వద్దకు ప్రజలు అధికసంఖ్యలో చేరుకుంటున్నారు.

పూర్తి స్థాయిలో...
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5.26 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 5.16 లక్షల క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.73 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల్లో జలవిద్యుత్తు తయారీ కొనసాగుతుంది.


Tags:    

Similar News