Nagarjuna Sagar : సాగర్ కు కొనసాగుతున్న వరద నీరు

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2025-07-23 04:55 GMT

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు స్థిరంగా కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 91,812 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అవుట్ ఫ్లో 1,14,709 క్యూ సెక్కులగా ఉంది. అయితే విడుదలవుతున్న నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 215.80 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 208.72 టీఎంసీలుగా ఉంది.

అవుట్ ఫ్లో...
అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 94,709 క్యూ సెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 4,835 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 572 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 261 టీఎంసీలుగా ఉంది.


Tags:    

Similar News