Buggana : మేఘా సంస్థదే పూర్తి బాధ్యత

తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తిప్పికొట్టారు

Update: 2023-11-23 07:26 GMT

టీడీపీ దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమన్నారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై టీడీపీ వెచ్చించింది రూ.5,177 కోట్లు మాత్రమేనని, తమ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514.84 కోట్లు అని ఆయన తెలిపారు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తున్నారని బుగ్గర ఫైర అయ్యారు.

అబద్ధపు ప్రచారం...
మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో తమకు కనీస అవగాహన లేదని మంత్రి బుగ్గన మండిపడ్డారు.ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుందెవరు?. రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు?. ఇన్నర్ రింగ్‌రోడ్డును మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? అని బుగ్గన ప్రశ్నించారు.


Tags:    

Similar News