Breaking : జగన్ - చిరంజీవి వివాదంపై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి రియాక్షన్
జగన్ - చిరంజీవి వివాదంపై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు.
జగన్ - చిరంజీవి వివాదంపై సినీనటుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. జగన్ చిరంజీవితో పాటు సినీ హీరోలను కూడా అవమానించలేదని చెప్పారు. సాదరంగా తమను ఆహ్వానించారు. సినీ ఇండ్రస్ట్రీ మొత్తం ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయిస్తే చిరంజీవి జగన్ తో మాట్లాడారని తెలిపారు. జగన్ సినీ పరిశ్రమకు చెందిన వారు కలిసేందుకు అంగీకరించారని తెలిపారు. జగన్ వద్దకు వచ్చిన వారందరినీ పేరుపేరునా పలకరించారని, ఆయన అవమానించలేదని ఆర్. నారాయణమూర్తి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్పందించిన తీరు వందకు వంద శాతం నిజమని తెలిపారు.
కోవిడ్ తో పరిశ్రమ...
కోవిడ్ తో పరిశ్రమ ఏమవుతుందోనని అనుకున్న సమయంలో సనీ పరిశ్రమకు చెందిన అందరం జగన్ ను కలిశామని తెలిపారు. నాడు చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ అన్నారు. సినీ పరిశ్రమకు ఏది కావాలో అది చేస్తామని నాడు జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో ఏ సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఇప్పుడు కూడా ఉన్నాయని ఆర్. నారాయణమూర్తి చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందుకు రావాలని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కలవాలని నాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తనను కూడా ఆహ్వానించారన్నారు.