నేడు కస్టడీకి పోసాని
సినీ నటుడు పోసాని కృష్ణమురళి నేడు పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు
సినీనటుడు పోసాని కృష్ణమురళిని నేడు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఒకరోజు ఆయనను విచారించేందుకు పోలీసులు విచారించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సీఐడీ పోలీసులు...
సీఐడీ పోలీసుల పిటీషన్ ను పరిశీలించిన న్యాయస్థానం ఒకరోజు మాత్రమే పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతించింది. దీంతో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సీఐడీ అధికారులు పోసాని కృష్ణమురళిని విచారించనున్నారు. ఈ వ్యాఖ్యల వెనక ఎవరున్నారన్న దానిపై పోసానిని ప్రధానంగా విచారించనున్నారు.