Posani Krishna Murali : పోసాని కృష్ణ మురళికి గ్రేట్ రిలీఫ్
సినీనటుడుపోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది.
సినీనటుడుపోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అయితే నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసులో ఈ బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏపీ వ్యాప్తంగా వరస కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
నరసరావుపేట కేసులో...
ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నరసరావుపేట లో ఆయన తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత పది వేల రూపాయలు,రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.