అమరావతి రైతులు చలో ఢిల్లీ

రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు

Update: 2022-03-23 01:55 GMT

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని న్యాయస్థానం ద్వారా రైతులు విజయం సాధించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కూడా రాజధాని రైతులు వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించి ఏడేళ్లవుతున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. మొత్తం 24 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది.

కేంద్ర మంత్రులను కలసి....
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పటి ప్రభుత్వం 208 ఎకరాలను కేటాయించింది. 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకారలను ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవీ ఇక్కడ వాటికి సంబంధించి భవన నిర్మాణాలను చేపట్టలేదు. దీంతో రాజధాని రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి దీనిపై చర్చించాలని నిర్ణయించారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 7 వ తేదీ వరకూ ఢీల్లీలోనే ఉండి పలువురు కేంద్ర మంత్రులను కలసి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News