దారుణంగా పడిపోయిన మిర్చి ధరలు

గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ధర దారుణంగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు

Update: 2024-02-06 06:16 GMT

గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ధర దారుణంగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కడప, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడిగాపులు కాస్తున్నారు. వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు కుమ్మక్కై ధరలు దారుణంగా తగ్గించారంటూ ఆందోళనకు దిగారు.

డిమాండ్ లేదని...
మిర్చికి డిమాండ్ లేదంటూ ధర తగ్గించడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీవ్ర వర్షా భావంతో మిర్చి ఉత్పత్తి తగ్గినా తగిన ధరలు లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత సీజన్ లో క్వింటాల్ మిర్చి ధర ఇరవై అయిదు నుంచి ముప్ఫయి వేల రూపాయలకు కొనుగోలు చేస్తే, ఈరోజు క్వింటాల్ ధర పది నుంచి పదిహేనువేలకు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.


Tags:    

Similar News