రూ.2 కోట్లు దోచుకున్న ఫేక్ పోలీసులు

అనంతపురంలో పోలీసులమని బెదిరించి 2 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు హైవే దొంగలు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది

Update: 2023-08-23 14:30 GMT

రూ.2 కోట్లు దోచుకున్న ఫేక్ పోలీసులు

అనంతపురంలో పోలీసులమని బెదిరించి 2 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు హైవే దొంగలు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. గార్లదిన్నె మండలం కనంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగస్టు 22 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ఘరానా మోసం జరిగింది.

పోలీసులం అంటూ రోడ్డుపై వస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. మీరు రోడ్డు యాక్సిడెంట్ చేసి వస్తున్నారంటూ డ్రైవర్ ని దబాయించారు నకిలీ పోలీసులు. మేము ఎక్కడా యాక్సిడెంట్ చేయలేదని చెప్పినా నకిలీ పోలీసులు వినలేదు. వారిని వేరే వాహనంలో ఎక్కించుకెళ్లి కాస్త దూరంపోయాక వారిని రోడ్డు పక్కన దింపేసి 2 కోట్ల రూపాయలతో ఉడాయించారు నకిలీ పోలీసులు. వాళ్లు నిజమైన పోలీసులు కాదని, తాము మోసపోయామని తెలిసి బాధితులు షాక్ కి గురయ్యారు.

అనంతపురం ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బెంగళూరు నుంచి ఆఫీస్ డబ్బు 2 కోట్ల రూపాయలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి 7 గంటలకు అనంతపురం మీదుగా హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా ఈ ఘరానా మోసం జరిగింది.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈ కేసుని సవాల్ గా తీసుకుని, నకిలీ పోలీసుల కోసం ప్రత్యేక టీమ్స్ తో గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News