Andhra Pradesh : ఏపీ మంత్రుల పేషీల్లో "ఫేక్" నియామకాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ల పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు సృష్టిస్తున్న విషయం బయటపడింది
ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ల పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు సృష్టిస్తున్న విషయం బయటపడింది. కొందరి దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని ఆర్డర్లు ఇస్తున్నట్లు వెల్లడయింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ముద్రించి పంపుతున్నారని ఫిర్యాదులు అందాయి.
డబ్బులు వసూలు చేశారా?
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై నాలుగు మంత్రుల పేషీలున్నాయి. వీటిలో ఒక్కొక్క పేషీలో ఒక్కొక్కరిని నియమించుకుంటారన్న వార్తలను కొందరు క్యాష్ చేసుకుంటారని బయటకు రావడంతో పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఈ నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ల పంపిణీ వెనక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు మొదలయినట్లు తెలిసింది.