ఏపీకి కొత్త పీసీసీ చీఫ్.. జనవరి మొదటి వారంలోనే?

ఆంధ్రప్రదేశ్ కు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కసరత్తు పూర్తయింది.

Update: 2021-12-25 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ కు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కసరత్తు పూర్తయింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు సాకే శైలజానాధ్ పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త చీఫ్ నియామకం కోసం పార్టీ అధినాయకత్వం కసరత్తు చేసింది. పార్టీ ఏపీ ఇన్ ఛార్జి ఉమెన్ చాందీ ఇటీవల రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండి అందరి అభిప్రాయాలను సేకరించారు.

పలువురి పేర్లను.....
ఆయన జనవరి మొదటి వారంలో సోనియా గాంధీని కలసి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయాలంటే కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిందేనని హైకమాండ్ డిసైడ్ అయింది. అయితే ఇందుకు ప్రతిపాదించిన నేతలను కూడా సంప్రదించినట్లు తెలిసింది. కొందరు సుముఖత వ్యక్తం చేయగా మరికొందరు ఆసక్తి కనపర్చలేదు. దీంతో ఫైనల్ గా ఒకరిని ఎంపిక చేసి పార్టీకి జవసత్వాలు తేవాలని హైకమాండ్ భావిస్తుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, హర్షకుమార్, మస్తాన్ వలి వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Tags:    

Similar News