ఏసీబీ కస్టడీలో విడదల గోపి.. రెండున్నర కోట్ల వసూలుపై కూపీ

మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారుల కస్టడీకి తీసుకున్నారు.

Update: 2025-05-01 06:46 GMT

మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారుల కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ వైద్య శాలలో గోపీకి వైద్య పరీక్షలు చేయించిన ఏసీబీ అధికారులు అనంతరం కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విడదల గోపీని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో గోపీని విచారిస్తున్న అధికారులు క్రషర్ యజమానిని బెదిరించడంపై ఆరా తీస్తున్నారు.

ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు...
విడదల గోపిని క్రషర్ యజమానిని బెదిరించి రెండున్నర కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడదల గోపీని తమ కస్టడీకి అప్పగించాలని, దీనిపై విచారించాలని కోరగా న్యాయస్థానం రెండు రోజులు అనుమతించింది. దీంతో విడుదల గోపీని ఇవాళ, రేపు ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News