జగన్ సత్తెనపల్లి పర్యటనపై కన్నా హాట్ కామెంట్స్

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనపై మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు

Update: 2025-06-17 07:51 GMT

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనపై మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నవ్యక్తిని పరామర్శకు వస్తూ పోలీసుల వేధింపుల కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు మరణించడం బాధాకరమని, అయితే పోలీసుల వేధింపులు తాళలేక ఆయన చనిపోలేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

వైసీపీ యే కారణం...
రాత్రికి హత్య చేసి ఉదయాన్నే వచ్చి పరామర్శించినట్లు ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. నాగమల్లేశ్వరావు మృతికి వైసీపీయే కారణమని అన్నారు. వైసీపీ గెలుస్తుందని నాగమల్లేశ్వరరావు పందేలు కాశారని, అప్పులు తీర్చలేక ఆయన మరణించారని అన్నారు. వైసీపీ నేతలే ఈ హత్య చేసి వారే పరామర్శంచడమేంటని కన్నాలక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.


Tags:    

Similar News