నేడు సీఐడీ విచారణకు జోగి రమేష్
మాజీ మంత్రి జోగి రమేష్ నేడు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
మాజీ మంత్రి జోగి రమేష్ నేడు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారించేందుకు జోగిరమేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు రావాలని కోరారు. గతంలోనూ పోలీసులు ఇదే కేసులో విచారించిన అధికారులు తర్వాత వదిలేశారు. ఈరోజు సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో...
వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ తన అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే నేడు సీఐడీ అధికారులు విచారణకు జోగి రమేష్ ను పిలిచారు. అయితే ఆయన హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.