జనసేన ఆవిర్భావ సభపై అంబటి సెటైర్లు
జనసేన ఆవిర్భావ సభపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
జనసేన ఆవిర్భావ సభపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఊడిగం చేసేందుకే జనసేన ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ అధికారంలోకి రాగానే ప్రశ్నించడం మానుకున్నారన్నారు. కూటమిలో భాగస్వామ్యులుగా ఉంటూ ప్రభుత్వం చేసే తప్పులకు కూడా కారణమవుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
హామీలు అమలు చేయకుండా...
సూపర్ సిక్స్ హామీలను అమలు పర్చడం లేదని ప్రశ్నించలేని పవన్ కల్యాణ్ ఈ ఆవిర్భావ సభ నుంచి ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినా పెదవి విప్పని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారని ఆయన నిలదీశారు. కేవలం తన క్యాడర్ ను కాపాడుకునేందుకే పిఠాపురంలో ఈ సభను ఏర్పాటు చేశారని అంబటి ఎద్దేవా చేశారు.