Amabati Rambabu : చంద్రబాబులో భయం కనపడుతుంది

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల హామీలు ఎంత మేరకు అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Update: 2025-08-24 12:34 GMT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల హామీలు ఎంత మేరకు అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబును చిత్తుగా ఓడిస్తారని అన్నారు. రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదన్నారు.

జగన్ తిరిగి వస్తాడని...
కొన్ని అమలు చేసినా ఏరివేత కార్యక్రమంతో అర్హులైన వారిని కూడా తొలగిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అన్నీ అమలు చేస్తున్నానని, సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చామని చెబుతున్న చంద్రబాబు తిరిగి జగన్ అధికారంలోకి వస్తారేమోనని భయపడిపోతున్నారని అన్నారు. పెద్దాపురం ప్రసంగంలోనూ ఇదే కనిపించిందన్న అంబటి రాంబాబు చంద్రబాబులో భయం కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు భూత వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెప్పారు.


Tags:    

Similar News