జగన్ ప్రభుత్వంపై త్వరలోనే స్పందిస్తా

జగన్ ప్రభుత్వ తీరుపై తాను ఇప్పుడేం మాట్లాడనని, త్వరలోనే స్పందిస్తానని మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు

Update: 2023-04-12 12:31 GMT

జగన్ ప్రభుత్వం తీరుపై తాను ఇప్పుడేం మాట్లాడనని, త్వరలోనే స్పందిస్తానని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి విజయవాడ వచ్చిన నల్లారి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని, అయితే తిరిగి పార్టీలో చేరాలని భావించి రెండో సారి చేరారన్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ బలోపేతం కాదని భావించి బయటకు వచ్చానని చెప్పారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సరైన నిర్ణయం కాదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సామాన్య కార్యకర్తగానే...
బీజేపీలో సామాన్య కార్యకర్తగానే సేవలందిస్తానని, పార్టీ అప్పగించిన ఏ పనినైనా చేస్తానని చెప్పారు. తాను హైదరాబాద్ లో పుట్టానని, అక్కడే బాల్యం, చదువు గడిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ తన సొంత ఊరు అని అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో కూడా తమ కుటుంబానికి బంధుత్వాలు ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారమనేది కాదని ఎలా పనిచేస్తున్నామన్నదే ముఖ్యమని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు కాంగ్రెస్ లో పీసీసీీ అధ్యక్షుడు ఇస్తామన్నా వద్దని చెప్పానని, తాను సరైన సమయంలోనే ప్రస్తుత ఏపీ ప్రభుత్వంపై స్పందిస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.



Tags:    

Similar News