ఏపీలో 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు రెడీ
పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు అత్యవసరంగా ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు.
పీఆర్సీ నివేదిక....
పీఆర్సీ నివేదికను బయటపెడతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ బయటపెట్టలేదన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా ప్రభుత్వం ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఈరోజు పీఆర్సీ నివేదికను బయట పెట్టాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. సాయంత్రానికి భవిష్యత్ కార్యాచరణను ఉద్యోగులు ప్రకటించనున్నారు.