నేడు టీటీడీ ఉద్యోగుల ధర్నా
నేడు టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగుల ధర్నా నిర్వహించనున్నారు.
నేడు టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగుల ధర్నా నిర్వహించనున్నారు. ఉద్యోగిని దూషించిన పాలకమండలి సభ్యుడి తీరుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు నరేశ్ అక్కడ ఉన్న ఉద్యోగిని ప్రధాన ద్వారం వద్ద అసభ్య పదజాలంతో దూషించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
పాలకమండలి సభ్యుడి తీరుకు నిరసనగా...
పాలకమండలి సభ్యుడు క్షమాపణ చెప్పడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు తమ విధులు నిర్వహించుకునేందుకు వీలుగా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పాలకమండలికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని టీటీడీ ఉద్యోగుల హెచ్చరిక జారీ చేశారు.