Cyclone Alert : తుపాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్తి తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. తెలంగాణలోనూ నేడు వర్షాలు పడనున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్తి తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీకి తుఫాన్ ముప్పు ఉందని మూడు రోజుల క్రితమే హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు దాని ప్రభావం వల్ల నిన్న తెల్లవారుజాము నుంచి ఉరుములతో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గాలి లేకపోవడంతో అరటి రైతులు కొంత ఊరట చెందారు. శక్తి తుఫాన్ దృష్ట్యా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అప్రమత్తమైన అధికారులు భారీ వర్షాల వల్ల చెట్లు నేలకొరిగిన,వర్షపు నీరు, నివాస ప్రాంతాల్లో ఆగిపోయిన తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు.
ఫోన్ నెంబర్లివీ...
వెంటనే తమకు ఫోన్ చేయాలని కోరారు. ఫోన్ నెంబర్ 7093912653, 08645-295192 ఇరవై నాలుగు గటలకు ప్రజలకి అందుబాటులోకి మంగళగిరి మున్సిపల్ కమిషనర్ తీసుకు వచ్చారు. నేడు కర్ణాటకలో తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శక్తి తుపాను ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. మే 23వ తేదీ వరకూ అల్పపీడన ప్రభావం కొనసాగనుందని వాతావరణ శఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో శక్తి తుపాను ఎఫెక్ట్ తో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, కడప, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
తెలంగాణలోనూ మరో మూడు రోజులు...
తెలంగాణలోనూ మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని కూడా చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా చెప్పింది. ఈరోజు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేిసది. అయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశముందని, రైతులు తమ పంట ఉత్పత్తులను రక్షించుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించింది.