ఏపీలో ఐదు రోజులు వర్సాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుపాను కారణంగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి

Update: 2022-03-22 02:01 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసనీ తుపాను కారణంగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తుపాను ప్రభావం ఏపీలో కనిపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి వర్షాలయినా మండు వేసవిలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తుపాను ప్రభావంతో....
ఆసనీ తుపాను ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కురియవచ్చని పేర్కొంది. అయితే ఈ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని కూడా పేర్కొంది. మొత్తం మీద తుపాను ప్రభావంతో మండు వేసవిలో చిరుజల్లులు ప్రజలను పులకరింప చేస్తున్నాయి.


Tags:    

Similar News